Saturday, December 24, 2022
Corporate world
Corporate world ... ఈ పేరు వినగానే గ్రామీణ, అర్బన్ ప్రాంత యువతకు చాలా పెద్ద పదంగా కనపడుతూ ఉంటుంది. English లో మాట్లాడే జనాలు, మెయిల్స్ గోల, colourful జీవితాలు, అర్థం కానీ యవ్వారాలు అనుకుంటూ ఉంటారు. ఆ చాలా మందిలో నేనూ కూడా ఒకడినే. భాష రాకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులతో మనలో మనం ఆత్మనూన్యతకు గురవుతూ ఉంటాం. ఇప్పటికీ నాకు ఇంగ్లిష్ అంటే మాట్లాడటానికి ఇబ్బందిపడే అంశమే.
అయితే, ఇక్కడితోనే మన భవిష్యత్తు ఆగిపోతుందని అనుకోవద్దు. మీలో నిజంగా ఎదగాలనే తపన, క్రమశిక్షణ, మంచి బుద్ధి, నలుగురిలో కలిసిపోయే తత్వం, సానుకూల దృక్పథంతో ఉంటే ఎదగగలం. అయితే అడుగులు తడబడొచ్చు, మెల్లగా వేయొచ్చు, మందకొడిగా సాగొచ్చు. అంతమాత్రం చేత మనలో ఎదుగుదల ఆగిపోయింది అనుకోవద్దు. అసలు భయపడొద్దు. మీకు వచ్చినదానితో మీరు ఎంత వరకు ప్రతిభావంతంగా పని చేయగలరో ఆలోచించండి. దానికి పదును పెట్టండి. భాష నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రాకపోయినా కంగారుపడొద్దు. ఆలస్యం అయినా గమ్యాన్ని చేరుకోవచ్చు. గగనంతో పోటీ పడేలా దూసుకుపోవచ్చు.
చెబుతున్నా కదా... డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం మనం. నాలా తెలుగులో మాత్రమే రాయగలిగే వాళ్లు చాలా మందికి అదే గొప్ప అవకాశం. ఆలోచించండి. సోషల్ మీడియాలో, మీరు చూస్తున్న ఓటీటీ ప్రపంచంలో మన మాతృభాషకు పెరుగుతున్న అవకాశాలు. స్థానికతకు పట్టం కడుతోంది ప్రపంచం.
16 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని అంటుంటారు. పది కోట్ల మంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మిగిలిన ప్రపంచంలో మిగిలిన వాళ్లు. తరాలు మారుతున్నా తెగిపోనిది ఏదైనా ఉందంటే మట్టితో మనకున్న మమకారమే. ఒక్కసారి గుండె లోతుల్లో ఉన్న ఆ తడిని తాకి చూడండి. మిమ్మల్ని ఎవరు దూరం పెడతారు? స్వార్థంతో కాదు. నిస్వార్థమైన, నిష్కల్మషమైన ఆలోచనతో మీరు నడవడం మొదలుపెట్టండి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినవారు అవుతారు. నాకు వచ్చిన భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించాను. ఇది మన భాష.. మన తెలుగు. మన ఊరి మాట. మన అమ్మ చూపిన బాట.
మిమ్మల్ని, నన్ను నడిపించేది ఆ తెలుగు బంధమే. కార్పొరేట్ దిగ్గజాలు కూడా వాళ్ల మాతృభాషలోనే ఆలోచిస్తారు. ఇంగ్లిష్‌లో ఆచరణలో పెడతారేమో అంతే. ఇక్కడ ఎవరి అవకాశాలను ఎవరూ గద్దల్లా తన్నుకుపోలేరు. మీకు ఆలోచన, వినూత్నమైన దృక్పథం ఉంటే మీకు ప్రపంచమే ఆహ్వానం పలుకుతుంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన అమ్మ భాష సాక్షిగా చెబుతున్న మాటలివి. గెలిచేంత వరకు కాదు, మరో నలుగురికి దారి చూపే వరకు ఈ పయనం సాగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
పున్నమి కౌగిలి
ఒక వర్షం కురిసిన రాత్రి కనులకు నిదుర దూరమైన క్షణం వర్షం వెలిసిన తర్వాత ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు పక్కనే తెల్లని కాంతితో సోగ్గాడు చంద్రుడు ...
-
గత కొన్ని రోజులుగా దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీన్నిదృష్టిలో పెట్టుకుని మా నవభారత నిర్మాణ సేన అన్న వితరణ క...
-
జలియన్ వాలాబాగ్ ఉదంతానికి నేటితో సరిగ్గా 101 ఏళ్లు. స్వాతంత్ర్య కాంక్షతో ఓ చోట గుమిగూడిన అమాయక జనంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు జనరల...
-
ఒక వర్షం కురిసిన రాత్రి కనులకు నిదుర దూరమైన క్షణం వర్షం వెలిసిన తర్వాత ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు పక్కనే తెల్లని కాంతితో సోగ్గాడు చంద్రుడు ...

No comments:
Post a Comment